A pastor Is strange comments In Gannavaram: ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలు వీడటం లేదు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పాస్టర్ నాగభూషణం.. తాను చనిపోయి సమాధి నుంచి మళ్లీ తిరిగొస్తానంటూ ఫ్లెక్సీలు కట్టించుకున్నాడు. గొల్లనపల్లిలోని తన స్థలంలో సమాధి కోసం గొయ్యిని తవ్వించుకున్నాడు. 10 రోజుల్లో తాను చనిపోతే ఇదే సమాధిలో పెట్టాలని.. మళ్లీ 3 రోజుల్లో బ్రతికి వస్తానంటూ కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు చెప్తున్నాడు.
10 రోజుల్లో చనిపోతున్నా.. మళ్లీ 3 రోజుల్లో తిరిగొస్తా.. పాస్టర్ ప్రకటన - పాస్టర్ నాగభూషణం
A pastor Is strange comments In Gannavaram: టెక్నాలజీలో దూసుకుపోతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలు వీడటం లేదు.. మహమ్మారి కరోనా మెడిసిన్ కనిపెట్టాం.. కానీ మూర్ఖత్వ జాఢ్యాలకు మాత్రం మందు కనిపెట్టలేకపోతున్నాం. ఇప్పటికే చేతబడులు, బాణామతులు, నరబలులు, లంకెబిందెలు, రైస్‌పుల్లింగులు, క్షుద్రపూజలు, దెయ్యాలకు సంబంధించిన ఘటనలు రోజూ ఏదే మూలన వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పాస్టర్ వింత ప్రవర్తన స్థానికులను షాక్‌కు గురి చేస్తోంది.

పాస్టర్ నాగభూషణం
ఆయన వైఖరితో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కంగారు పడుతున్నారు.. ఇలాంటి పాస్టర్స్ ప్రజలను కూడా అపనమ్మకాలవైపు నడిపిస్తారని.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు. ముందు ఇతగాడికి కౌన్సిలింగ్ ఇప్పించాలని.. మారని పక్షంలో మానసిక వికలాంగుల సంరక్షణ శాలకు తరలించి.. చికిత్స అందించాలంటున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో పాస్టర్ వింత వ్యాఖ్యలు
ఇవీ చదవండి:
Last Updated : Nov 21, 2022, 2:04 PM IST