ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

23వ తేదీ.. 23 ఓట్లు.. ఇది క‌దా దేవుడి స్క్రిప్ట్ అంటే..! : తెదేపా

Leaders congratulate TDP candidate Anuradha : ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన టీడీపీ అభ్యర్థి అనురాధకు ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తెలుగింటి ఆడ‌ప‌డుచు.. మా తెలుగుదేశం కుటుంబ‌ స‌భ్యురాలు అనురాధ గారికి హృద‌య‌ పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని ట్విటర్ వేదికగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 23, 2023, 8:50 PM IST

Updated : Mar 24, 2023, 6:37 AM IST

Leaders congratulate TDP candidate Anuradha : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపుతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు కేక్‌ కట్‌ చేసి పలువురు నేతలకు తినిపించారు.

కేక్​ కట్​ చేసిన చంద్రబాబు

ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన టీడీపీ అభ్యర్థి అనురాధకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్, చేనేత ఆడ‌ప‌డుచు, మా తెలుగుదేశం కుటుంబ‌ స‌భ్యురాలు అనూరాధ గారికి హృద‌య‌ పూర్వ‌క శుభాకాంక్ష‌లు".. "మేము 23 సీట్లే గెలిచామ‌ని ఎద్దేవా చేశావు. అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నావు. ఫైనల్ గా అదే 23వ తేదీన‌.. అదే 23 ఓట్ల‌తో నీ ఓట‌మి మా గెలుపు... ఇది క‌దా దేవుడి స్క్రిప్ట్ అంటే జగన్ గారు!" అని లోకేశ్ పేర్కొన్నారు.

అనురాధ గెలుపు ప్రజా విజయంమని బాలకృష్ణ అన్నారు అనురాధ గెలుపు అన్ని వర్గాల ప్రజల గెలుపు అని స్పష్టం చేశారు. క్లిష్ట ఎన్నికల్లో అనురాధ సునాయాస గెలుపు స్ఫూర్తిదాయకమన్నారు. చంద్రబాబు పోరాట స్ఫూర్తి, కార్యకర్తల కృషి వల్లే వరుస విజయాలు సాధిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని.. తెదేపాను విజయపథంలో నిలబెట్టడమే మనందరి కర్తవ్యమని బాలకృష్ణ సూచించారు.

దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 ఓట్లతో గెలిచాం... మా అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినా ప్రకటనలో జాప్యం చేశారు.. అనవసరంగా పోటీ పెట్టారంటూ ఇష్టారీతిన ఆరోపించారు.. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విందు రాజకీయాలు చేశారు అని మండిపడ్డారు. సీఎం జగనే స్వయంగా టీడీపీ అభ్యర్థికి ఓటేశారేమో? అని ఎద్దేవా చేశారు. ఓటింగులో పాల్గొనకుండా భవానీ కుటుంబాన్ని వేధిస్తారా? అని ధ్వజమెత్తారు.

టీడీపీ నేతల సంబరాలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతారని గోరంట్ల పేర్కొన్నారు.

సీఎం జగన్‌ పతనం మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు అన్నారు. ఒక ఎమ్మెల్సీని గెలిచేందుకు సీఎం స్థాయి వ్యక్తి నీచానికి దిగజారారని, బీసీ మహిళ ఓటమికి ఇష్టారీతిన బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అనురాధ కుటుంబ సభ్యులను బెదిరించినా, ప్రలోభాలకు గురి చేశారని.. చివరకు ధర్మమే గెలిచిందని తెలిపారు.

దేశంలో ప్రజాస్వామ్యం గొప్పతనం ఇవాళ చూశామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినా పట్టభద్రులు గొప్ప తీర్పు ఇచ్చారని గుర్తు చేస్తూ... అనూరాధ విజయంతో వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజాప్రతినిధులకు విలువ లేదని ఆనంద్ బాబు విమర్శించారు.

నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ... ఎమ్మెల్సీగా విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు అభినందనలు తెలిపారు. తెలుగుదేశం ఆడపడుచు అనురాధకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ నందమూరి రామకృష్ణ అభినందనలు తెలిపారు.

అనురాధ గెలుపుపై తెదేపా శ్రేణుల అభిప్రాయాలు

ఇవీ చదవండి :

Last Updated : Mar 24, 2023, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details