ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మృతి.. ఇంజెక్షన్​ దొరకకనే..! - today The old man died of black fungus in vijayawada news update

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వృద్ధుడు.. బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలోని నున్నలో జరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడిన వృద్ధుడిని ప్రవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిక్షీంచి బ్లాక్ ఫంగస్​గా గుర్తించారు. ఇంజెక్షన్​ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

black fungus
బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మృతి

By

Published : May 23, 2021, 10:10 AM IST

విజయవాడ గ్రామీణం నున్నలో బ్లాక్ ఫంగస్‌తో వృద్ధుడు మృతి చెందాడు. 64 ఏళ్ల చింతా వెంకటేశ్వరరావు.. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందిన ఆయన.. కరోనా లక్షణాలు తగ్గిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు.

వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. బ్లాక్ ఫంగస్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎంత ప్రయత్నించినా బ్లాక్ ఫంగస్‌కు వినియోగించే ఇంజెక్షన్ దొరకలేదని.. అందుకే వెంకటేశ్వరరావు మృతి చెందారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details