ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిరోడ్డులో నాన్న కథ విషాదాంతం...! - Lakshmipuram bus stop old man news

ఆ వృద్ధుడు అయినవారికి భారమయ్యాడు. కన్న కొడుకు, కూతురు పట్టించుకోలేదు. ముదిమి వయసులో బస్టాప్​లో పది రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. అతని దీనస్థితిని ఈనాడు-ఈటీవీ కథనాలకు రూపంలో వెలుగులోకి తీసుకొచ్చింది. పోలీసుల ఒత్తిడితో మనసు మార్చుకున్న కుమార్తె తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లింది. ఆ వృద్ధునికి ఆసరా దొరికింది అనుకునే లోపే అతను చనిపోయాడు. కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు.

లక్ష్మీపురం బస్ స్టాప్ లో వృద్ధుడు

By

Published : Oct 25, 2019, 5:27 PM IST

Updated : Oct 25, 2019, 6:07 PM IST

లక్ష్మీపురం బస్ స్టాప్ లో వృద్ధుడు

కృష్ణాజిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం బస్​స్టాప్​లో కొద్ది రోజుల ముందు జీవచ్ఛవంలా పడి ఉన్న వృద్ధుడు వేముల రామ నరసింహం మరణించాడు. దీనస్థితిలో ఉన్న అతని గురించి ఈనాడు-ఈటీవీ కథనాల రూపంలో వెలుగులోకి తెచ్చింది. పోలీసుల ఒత్తిడితో రామ నరసింహం కుమార్తె అతన్ని ఇంటికి తీసుకెళ్లింది. అయితే తన సోదరుడు తన తండ్రిని చూడడం లేదని ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కుమారున్ని చరవాణిలో సంప్రదించగా స్పందన లేదు. గురువారం రామ నరసింహం తుది శ్వాస విడిచాడు. వృద్ధుడు చనిపోవడంపై కుటుంబ సభ్యులు కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గుట్టుచప్పుడు కాకుండా తిరువూరులో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Last Updated : Oct 25, 2019, 6:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details