ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ.. ఫిబ్రవరి 15కు వాయిదా.. - ఎన్ఐఏ కోడి కత్తి కేసు
13:12 January 31
కేసులో మొదటి సాక్షి దినేష్ కుమార్ గైర్హాజరు
కోడి కత్తి దాడి కేసులో బాధితుడు, సాక్షిగా ఉన్న సీఎం జగన్ పేరుతో కూడిన విచారణ షెడ్యూల్‌ను తదుపరి విచారణలోపు తాజాగా దాఖలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థను విజయవాడలోని N.I.A కోర్టు ఆదేశించినట్లు నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు. మొదటి సాక్షి విచారణ అనంతరం హాజరయ్యే సాక్షుల జాబితా వివరాలను మెమో రూపంలో సమర్పించాలని గతంలో కోర్టు ఆదేశించినా దర్యాప్తు సంస్థ దాఖలు చేయలేదన్నారు. విచారణకు మొదటి సాక్షిగా ఉన్న విశాఖ విమానాశ్రయం C.I.S.F అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్ హాజరు కావాల్సి ఉందన్నారు. ఆయన తండ్రి చనిపోవడంతో రాలేకపోయారని, ఆ వివరాలతో ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసిందన్నారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును ఫిబ్రవరి 15కు వాయిదా వేశారని తెలిపారు.
ఇవీ చదవండి :