ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో కొడుకు మృతి..తట్టుకోలేక తల్లి ఆత్మహత్య - woman suicide latest news update

కరోనా ధాటికి కల్లోలమవుతున్న బతుకులు ఎన్నో.. అలాంటి వాటిలో ఒకటి కృష్ణా జిల్లా నాగాయలంకలో జరిగిన ఘటన. కొడుకు మరణంతో కడుపు కోత తట్టుకోలేని ఆ తల్లి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కరోనా భయంతో బంధువులు ఎవరూ ఆమె దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు రాలేదు.

mother-committed-suicide
కొడుకు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

By

Published : Jul 27, 2020, 12:05 AM IST

కుమారుని మరణం తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నాగాయలంకలో మూడు రోజుల క్రితం హైమావతి(62) కుమారుడు కరోనాతో మృతి చెందాడు. కుమారుని మరణం తట్టుకోలేకపోయిన ఆ తల్లి కృష్ణా నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కరోనా భయంతో బంధువులు, స్నేహితులు ఎవరూ ఆమె మృతదేహం వద్దకు రాలేదు. దీంతో వేరే దారిలేక ఆమె దహన సంస్కారాలను నాగాయలంక పోలీసులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details