ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిరాతకంగా నరికి.. రెండు భాగాలు చేసి కేఈబీ కెనాల్​లో విసిరేశారు.. - కృష్ణా జిల్లా సమాచారం

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని దారుణంగా నరికి రెండు భాగాలు చేసి కేఈబీ కెనాల్​లో పడేశారు. అగినపర్రు గ్రామానికి చెందిన మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్యను అదే గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు గరికే ఏడుకొండలు.. నాగరాజు హత్య చేశారు. నాంచారయ్యను కిరాతకంగా నరికి రెండు భాగాలుగా చేసి కేఈబీ కెనాల్​లో పడేశారు.

హత్య
హత్య

By

Published : Aug 16, 2021, 9:17 PM IST

Updated : Aug 17, 2021, 8:08 PM IST

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ - వెలివోలు గ్రామాల మధ్యలో కృష్ణానది ఎడమ కరకట్ట కేఈబీ కాలువలో రెండు మూటలలో మృతదేహం కలకలం రేపింది. కాలువలో మూటలున్నాయని చల్లపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మూటలను విప్పి చూడగా అందులో మృతదేహం రెండు భాగాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.

కాగా అంతకుముందు అగినపర్రు గ్రామానికి చెందిన దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని చంపి ఆ కాలువలో పడవేసినట్లు కూచిపూడి పోలీస్​ స్టేషన్​లో గరికే ఏడుకొండలు అనే వ్యక్తి లొంగిపోయాడు.

పోలీసులు ఆ కోణంలో విచారిస్తూ నాంచారయ్య కుటుంబ సభ్యులను నిమ్మగడ్డ లాకుల వద్దకు తీసుకొచ్చారు. ఆ శవం నాంచారయ్యదేనని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఏడుకొండలు కుమారుడు నాగరాజు ఈ హత్యలో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Ramya Murder case : 'ప్రేమించాలంటూ వేధించాడు... కాదన్నందుకు కడతేర్చాడు'

Last Updated : Aug 17, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details