ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lovers stabbed in the lodge : 'లాడ్జీలో ప్రేమికులపై కత్తిపోట్లు..' 'బస్సులో మహిళా దొంగలు..' - private lodge in Achyutapuram

Lovers stabbed in the lodge : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ప్రైవేటు లాడ్జీలో ప్రేమికులు అనుమానాస్పద స్థితిలో కత్తిపోట్లకు గురయ్యారు. యువతి మృతిచెందగా.. యువకుడు చికిత్స పొందుతున్నాడు. బస్సులో ప్రయాణికుల వద్ద నగలు అపహరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జంగారెడ్డిగూడెం వద్ద చోటుచేసుకుంది.

Etv Bharat
Etv Bharat

By

Published : May 30, 2023, 9:54 AM IST

Lovers stabbed in the lodge : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ప్రేమికులు కత్తిపోట్లకు గురికావడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ సంఘటనలో యువతి లాడ్జిలో మృతి చెందగా యువకుడు కొనఊపిరితో అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలివీ.. గాజువాక గ్రామానికి చెందిన యువకుడు, రాంబిల్లి మండల సచివాలయంలో పనిచేస్తున్న యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు వీరిద్దరూ ఈరోజు అచ్యుతాపురంలోని లాడ్జిలో ఒక రూమ్ తీసుకున్నారు. అక్కడ ఏం జరిగిందో కానీ యువతి కత్తి పోట్లతో మృతి చెందగా యువకుడు గాయాలతో పడి ఉన్నారు. ప్రియుడే ప్రియురాలిని కత్తితో పొడిచిచంపి తాను కూడా పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

యువతి మృతదేహాన్ని మార్చురీకి తరలించి గాయపడిన యువకుడిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిద్దరూ వివాహం చేసుకున్నారా? లేదా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన యువతి స్వగ్రామం కూర్మన్నపాలెం కాగా, యువకుడు గాజువాక ప్రాంతంలోని అరుణోదయ కాలనీ వాసి. వీరిద్దరూ గాజువాక సమీపానికి చెందిన వారే కావడంతో గాజువాక పోలీసులను అప్రమత్తం చేశారు యువతి మెడపై కత్తితో కోసిన గాయాలు ఉన్నాయి. యువకుడి పొట్టపై కత్తిపోట్లు కనిపించాయి. పరవాడ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన యువతి పేరు ఎస్.మహాలక్ష్మి కాగా, చికిత్స పొందుతున్న యువకుడు మాడెం శ్రీనివాస్ కుమార్ గా గుర్తించారు అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..!

Passengers' jewelery was lost in the bus : ఓబస్సులో వెళుతున్న ఇద్దరి ప్రయాణికుల సంచుల్లోని బంగారు వస్తువులను కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం డిపోకు చెందిన బస్సులో జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద పామర్తి అంజలీప్రసన్న, లక్ష్మీలావణ్య అనే ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. బస్సు ఎక్కిన కొద్ది సేపటికే వారి సంచుల్లో ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు గుర్తించారు. అంజలీప్రసన్నకు చెందిన రెండు కాసుల బంగారు తాడు, లక్ష్మీలావణ్యకు చెందిన బంగారు తాడు, రెండు ఉంగరాలు చోరీకి గురవడంతో.. వారి అభ్యర్థన మేరకు డ్రైవర్ బస్సును స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లాడు.

పోలీసులు తనిఖీలు చేపట్టడంతో లక్ష్మీలావణ్యకు చెందిన రెండు ఉంగరాలు బస్సులో దొరకగా.. అనుమానితులైన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మహిళ నుంచి అంజలీప్రసన్నకు చెందిన బంగారు తాడు స్వాధీనం చేసుకోగా దానిని పోలీసులు ఆమెకు అప్పగించారు. మరో బంగారు తాడు లభ్యం కావాల్సి ఉండగా అదుపులో కి తీసుకున్న ఇద్దరు మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.

పోకిరీలకు షాక్​ తగిలేలా ఎలక్ట్రిక్​ చెప్పులు.. వీటితో మహిళలకు ఎంతో సేఫ్​!

Suspicious death of young woman : నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాల సరిహద్దు ప్రాంతమైన సౌత్ ఆములూరులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పొలాల దగ్గర చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజులైనట్లు కుళ్లిన మృతదేహాన్ని చూస్తే తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏదైనా సమస్యతో ఆ యువతి ఉరేసుకుందా లేక ఎవరైనా చంపి ఉరేసుకున్నట్లు చిత్రీకరించారా..? అన్నది తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

Single Major Subject in Degree : డిగ్రీలో సింగిల్ సబ్జెక్ట్.. పేద విద్యార్ధుల అవకాశాలపై ఎఫెక్ట్..!

ABOUT THE AUTHOR

...view details