నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో నిన్న గండి పడింది. సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతోంది అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనంగా మారడంతో ఈ గండి పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు కాల్వకు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
నాగర్జునసాగర్ ఎడమ కాల్వకు గండి.. తెలంగాణ నల్గొండలో నీట మునిగిన పంటలు - The left canal of Sagar is flooded Crop fields
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. దీంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు.
వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదలను ఆపేశారు. అయితే కాల్వలో ఉన్న నీరు మొత్తం గండి ద్వారానే బయటకు వెళ్లిపోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కాల్వ కట్ట దిగువ ప్రాంతంలోని రైతులు పొలాల్లో వరి నాట్లు వేశారు. ఫలితంగా వందల ఎకరాల్లో పొలాలన్ని నీట మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి వరి నాట్లు కొట్టుకుపోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటిని విడుదల నిలిపివేశామని..ఇవాళ కాల్వకు గండిపూడ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.