pawan comments : తాడేపల్లిలో అంధ యువతి హత్య శాంతిభద్రతల వైఫల్యమే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? సీఎం నివాసం దగ్గరలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రేప్ కేసులో నిందితుడిని ఇంకా పట్టుకోలేదని, తన నివాసం పరిసరాల పరిస్థితులనే సమీక్షించకుంటే ఎలా? అని ఆందోళన వ్యక్తం చేశారు.
మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పవన్ పేర్కొన్నారు. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని, తల్లి పెంపకంలోనే లోపం ఉందనే మంత్రులు కలిగిన ఈ ప్రభుత్వ పాలనలో దారుణ ఘటనలపై అన్ని వర్గాలూ ఆలోచన చేయాలని సూచించారు. అఘాయిత్యాలు సాగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?.. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని విమర్శించారు.