ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆశ చూపి డబ్బు వసూలు చేశారు...అడిగితే ముఖం చాటేశారు! - కృష్ణా జిల్లా వార్తలు

అధిక వడ్డీ ఆశ చూపి...ఖాతాదారుల నుంచి కోట్లలో డబ్బు వసూలు చేసి ఓ సంస్థ ముఖం చాటేసిన ఉదంతం కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.

gudivada
మోసం చేశారని ధర్నా

By

Published : Sep 15, 2020, 3:13 PM IST

అధిక వడ్డీ ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లలో సొమ్ములు వసూలు చేసిన కృష్ణా జిల్లా గుడివాడ ఆదర్శ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ముఖం చాటేయటంతో....ఖాతాదారులు ధర్నాకు దిగారు. తాము నిరుపేదలమని రూపాయి రూపాయి పోగుచేసి అధిక వడ్డీ ఆశ చూపితే డబ్బులు కట్టామన్నారు. గడువు ముగిసినా నగదు ఇవ్వడంలో జాప్యం చేస్తూ... సరైన సమాధానం చెప్పడం లేదని ఖాతాదారులు వాపోయారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా తమ చేతుల్లో ఏమీ లేదని సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాము కట్టిన డబ్బులు ఇవ్వాలని లేకుంటే సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details