గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాలలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలు వైకాపాతోనే సాధ్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అన్నారు. 13 వ వార్డ్ లో సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తో కలసి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 17వవార్డు సచీవాలయాలన్నీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్ సాకారం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 15, 16 వార్డు సంబంధించిన వార్డు సచివాలయ భవనం, మైలవరం, ఎర్రగుంట్ల , ముద్దనూరు మండలాల్లో నూతన వార్డు ,గ్రామ సచివాలయ భవనాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు.