ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్కింగ్ రుసుములపై హైకోర్టులో విచారణ - The High Court responded to the parking

వాణిజ్య సంబంధ మాల్స్, సినిమా థియేటర్లకు వచ్చే వారి నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. రుసుము వసూలు ఆక్రమం అని తేలితే ...నిర్వహకుల నుంచి సొమ్ము రాబట్టాలని అధికారులను ఆదేశించింది.

The High Court responded to the lawsuit  of parking
ఏపీ హైకోర్టు

By

Published : Jan 27, 2020, 11:41 PM IST

వాణిజ్య సంబంధ మాల్స్​లలో పార్కింగ్ రుసుము వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారమై జాయింట్ కలెక్టర్లకు వినతి సమర్పించాలని.. దానిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రుసుము వసూలు ఆక్రమం అని తేలితే వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్న విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి తదితర పట్టణాల్లోని సినిమా థియేటర్లు , షాపింగ్ మాల్స్ నిర్వహకుల నుంచి సొమ్ము రాబట్టాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎస్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంబంధ మాల్స్​లో వాహనాల పార్కింగ్​కు రుసుము వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ ముందడుగు ప్రజా పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది ఎన్ఎన్​ గ్రేస్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. 2003లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయడానికి వీల్లేదన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రుసుము వసూలు చేయడం చట్ట విరుద్ధమైతే ఆ సొమ్మును ఎందుకు తిరిగి రాబట్టలేదని అధికారులను ప్రశ్నించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details