కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న కంకర అక్రమ తవ్వకాల విషయంలో దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ చేసేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించింది. హైకోర్టు న్యాయవాది అశ్వత్థనారాయణను అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించిన న్యాయస్థానం .. అతనికి ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో జిల్లా సర్వేయర్ ఆధ్వర్యంలోని బృందంతో పరిశీలన చేసి.. నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
'కంకర అక్రమ తవ్వకాలు... నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్ నియామాకం'
కృష్ణా జిల్లాలో కంకర అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంపై నిజనిర్ధారణ చేసేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి.. నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది.
తోటపల్లి గ్రామంలో ఎల్వీవీఆర్వీ ప్రసాద్ అనే వ్యక్తి 12 హెక్టారుల్లో గ్రావెల్ మైనింగ్‌కు అనుమతి పొంది .. పరిధికి మించి 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ మద్దూరు గ్రామానికి చెందిన యనమదల రంజిత్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అనుమతులు తీసుకున్నదానికి మించి మైనింగ్ నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ప్రజా ఖజానాకు గండీకొడుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఇదీ చదవండి:HIGH COURT: 'నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల వివరాలివ్వండి'