ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుషికొండ తవ్వకాలపై నాలుగువారాల్లో తేల్చండి.. హైకోర్టు

central committee enquiry : విశాఖలోని రుషికొండ తవ్వకాలపై విచారణ నాలుగు వారాల్లో పూర్తి చేయాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

విశాఖలోని రుషికొండ
విశాఖలోని రుషికొండ

By

Published : Feb 17, 2023, 8:30 AM IST

Updated : Feb 17, 2023, 10:09 AM IST

central committee enquiry : విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీని ఏర్పాటు చేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ హైకోర్టుకు నివేదించారు. కమిటీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీవీఎస్ఎన్ శర్మ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త డి.సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్(ఎన్సీఎస్సీఎం) శాస్త్రవేత్త డాక్టర్ మానిక్ మహాపాత్ర, కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యనిర్వహణ ఇంజనీర్ ఉన్నట్లు వెల్లడించారు.

విశాఖలోని రుషికొండ

ఆయా వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇచ్చేందుకు 8 వారాల సమయం కావాలని కోరగా.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. అక్రమ తవ్వకాలపై సమాచారాన్ని డీఎస్​జీ ద్వారా కమిటీకి అందజేసేందుకు పిటిషనర్లకు అనుమతిచ్చింది. విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు... విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్టు(పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్) అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎంపి రఘురామ కృష్ణం రాజు తన వాదనలు వినాల్సిందిగా ఇంప్టీడ్ పిటిషన్ వేశారు.

ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ముగ్గురు ఏపీ ప్రభుత్వశాఖలకు చెందిన వారు ఎంవోఈఎఫ్ ఏర్పాటు చేసిన కమిటీలో ఉండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ ఎదుర్కొంటున్నదున.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ, సంస్థలకు చెందిన అధికారులతో కమిటీ వేయాలని ఎంవోఈఎఫ్ ను ఆదేశించింది. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి స్పందిస్తూ.. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీపై అభ్యంతరం లేదన్నారు. గత కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడంతో అభ్యంతరం తెలిపామని విన్నవించారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 17, 2023, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details