ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 మద్యం సీసాలు..పొరుగు రాష్ట్రాలవైతే కుదరదు..! - మూడు మద్యం సీసాలు వార్తలు

ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకునే 3 మద్యం సీసాలకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు సన్నహాలు చేస్తున్నారు. మద్యం సీసాల చట్టం సవరణలను రాష్ట్ర ప్రభుత్వం మార్చేదిశగా ఆలోచనలు చేస్తోంది

The government will change the  three liquor bottles  amendment
3 మద్యం సీసాలు

By

Published : Oct 4, 2020, 9:37 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యమైతే.. మూడు సీసాలైనా అనుమతించకూడదని ఎక్సైజ్‌శాఖ యోచిస్తోంది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా మూడు సీసాల వరకు మద్యం నిల్వ ఉంచుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదని గతేడాది సెప్టెంబరులో ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో కొందరు వ్యక్తులు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3 సీసాల చొప్పున తెచ్చుకుంటున్నారు. వారిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరి వద్ద గరిష్ఠంగా 3 సీసాల వరకు ఉండొచ్చని ప్రభుత్వమే ఉత్తర్వుల్లో పేర్కొన్నపుడు.. అది ఏపీలో కొనుగోలు చేసినదైనా, ఇతర రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా నేరం కాబోదని ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన మద్యాన్ని మూడు సీసాల చొప్పున తెచ్చుకునే వారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కొందరు తక్కువ రకం మద్యాన్ని తెచ్చి ఇళ్లలో ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు సీసాల నిబంధన మార్చుతూ చట్ట సవరణ చేయడంతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యంపై అదనపు పన్ను విధించాలని ప్రతిపాదించింది.

ABOUT THE AUTHOR

...view details