ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జై అమరావతి అంటే జైల్లో పెడుతున్నారు' - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

అమరావతి కోసం పోరాడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జై అమరావతి అంటే చాలు... ప్రభుత్వ వ్యతిరేక నినాదంగా భావించి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

By

Published : Feb 12, 2020, 8:26 PM IST

నారా లోకేశ్ ప్రసంగం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కృష్ణా జిల్లా నందిగామలో రైతులు, ప్రజలు చేస్తున్న దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా ఒకే రాజధాని కావాలని కోరుకుంటున్నారని లోకేశ్ స్పష్టం చేశారు. సీఎం జగన్‌ మాత్రం.. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా మూడు ముక్కల రాజధానిని ఏర్పాటు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. జై అమరావతి అంటే ప్రభుత్వ వ్యతిరేక నినాదంగా భావించి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు.

అమరావతి కోసం నిరసన వ్యక్తం చేసినందుకు యువకులపై బాపట్ల ఎంపీ సురేశ్​ దాడి చేశారని.... అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను పోపో అంటుంటే తెలంగాణ ప్రభుత్వం రారా అని ఎర్ర తివాచీ పరుస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం రాసిన రాయటర్స్​ని కూడా ఎల్లో మీడియా అని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దిల్లీ వెళ్లిన సీఎం ప్రత్యేక హోదా కోసం కనీసం ఒత్తిడి కూడా తేవడం లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details