నాల్గో విడత ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (pmgkay) పథకం కింద ఈ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తామని భారత ఆహార సంస్థ (fci) ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ అమరేష్ కుమార్ తెలిపారు. ఈ పథకం ఈ నెల నుంచి నవంబరు వరకు అమలులో ఉంటుందని విజయవాడ రీజినల్ కార్యాలయంలో తెలిపారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఇప్పటివరకు 84 కోట్ల మందికి లబ్ధిచేకూరిందన్న అమరేష్ కుమార్... ఇందుకు కేంద్రం రూ.12,900 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నెలకు రాష్ట్కానికి 1.34 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని, అందుకు రూ.496 కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పారు. 2021-22 ఏడాదికి 13.97 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా 9.2 కోట్ల మంది పిల్లలకు బలవర్థకమైన బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తోందని అమరేష్ కుమార్ తెలిపారు.