ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్సైజ్ శాఖ 70 శాతం సిబ్బందిని.. ఎస్ఈబీకి కేటాయింపు - ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాజా వార్తలు

ఇసుక, మద్యం, నాటుసారా విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరోను.. అధికారులు పటిష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ముందుగా సిబ్బంది భర్తీని చేపడుతున్నారు. విభాగాల పనులను వివిధ శాఖలకు అప్పగించనున్నారు.

The excise department  staff allotted to the  Special Enforcement Bureau
ప్రభుత్వ లోగో

By

Published : May 20, 2020, 9:25 AM IST

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న 70 శాతం సిబ్బందిని ఎస్ఈబీకి కేటాయించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రస్థాయి అధికారులు, ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా వకుల్ జిందాల్​ బాధ్యతలు స్వీకరించారు.

ఉప కమిషనర్, సహాయ కమిషనర్, సూపరింటెండెంట్, సహాయ సూపరింటెండెంట్, సీఐ, ఎస్సై , హెడ్ కాని స్టేబుల్, మినిస్టీరియల్ సిబ్బంది విభజన కేటాయింపులూ పూర్తయ్యాయి. ప్రస్తుతం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారులుగా కొనసాగుతున్న ఉపకమిషనర్ మురళీధర్, సూపరింటెండెంట్ మనోహర్, సహాయ సూపరింటెండ్ ప్రభాకర్ రావును ఎస్ఈబీకి కేటాయించారు. మరో సహాయ సూపరింటెండెంట్ రఘుమారెడ్డి ఎక్సైజ్​లో కొనసాగనున్నారు.

  • ఎక్సైజ్ శాఖ.. లైసెన్సులు, ఫీజు వసూలు, షాపుల పర్యవేక్షణ, బార్లు, క్లబ్ లు, టూరిజం లైసెన్సులు, కల్లు షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు.
  • ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అవుట్ లెట్లు, క్లబ్​లు, ఏపీ టూరిజంలో మద్యం విక్రయాలకు సంబంధించి లైసెన్సులను కమిషనర్ జారీ చేస్తారు.
  • బార్లకు డిప్యూటీ కమిషనర్, కల్లు షాపులకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు లైసెన్సులు జారీ చేస్తారు. ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సిబ్బంది అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు చేస్తారు.
  • కేసుల నమోదు, ఎఫ్ఐఆర్, నిందితులను కోర్టుకు హాజరు పరచడం, దర్యాప్తు, పట్టుబడిన వాహనాలను సీజ్ చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి సమన్లు జారీ చేయడం ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పరిధిలోకి వస్తాయి.

ABOUT THE AUTHOR

...view details