ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మానను తప్పించండి: రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం - Deputy Chief Minister dharmana comments latest

తమ కష్టాన్ని కించపరుస్తూ.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు చేశారంటూ.. రాష్ట్ర ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం ఆగ్రహించింది. ఎండావానలను సైతం లెక్కచేయకుండా.. పనిచేసే తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా.. ప్రభుత్వ పెద్దలు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తగదన్నారు.

Employees
Employees

By

Published : Oct 17, 2020, 7:23 PM IST

'మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​ను భర్తరఫ్ చేయాలి' అంటూ రాష్ట్ర ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తమ కష్టాన్ని కించపరుస్తూ.. మంత్రి వ్యాఖ్యలు చేశారని నేతలు ఆవేదన చెందారు. రెక్కాడితే కానీ.. డొక్కాడని తమకు.. మంత్రి వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయన్నారు.

తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఎండావానలను సైతం లెక్కచేయకుండా.. పనిచేసే తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా.. ప్రభుత్వ పెద్దలు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం తగదని రాష్ట్ర ఉపాధి హామీ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.సాంబశివరావు హితవు పలికారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details