కృష్ణా జిల్లా గంపలగూడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చేస్తున్న నాగేశ్వరరావు... తెలంగాణ నుంచి ఆంధ్రకు ఆక్రమంగా మద్యం తీసుకువస్తున్న వ్యక్తిని నిలువరించి డబ్బులు వసూలు చేశాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతించాలంటే 10,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 5000 రూపాయలను గూగుల్ పే ద్వారా తన ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. విస్సన్నపేట ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద పనిచేస్తున్న అజయ్ అనే కానిస్టేబుల్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి అక్రమంగా వస్తున్న వాహనదారుల నుంచి డబ్బుల వసూలు చేశాడు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇద్దరు కానిస్టేబుళ్ల అవినీతి బయటపడటంతో వారిని సస్పెండ్ చేశారు.
ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్పీ - two constables suspended krishna district
అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు కానిస్టేబుళ్లని సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ