ఆ మొక్క పెరిగి పెద్దదై విత్తనాలు వచ్చాయి. కొన్ని మొక్కలను నర్సరీల నుంచి తీసుకొచ్చి, కంప్యూటర్లో చూసి అంట్లు కట్టడం నేర్చుకున్నారు జయశ్రీ. తోటమాలి రాంబాబు సాయంతో మొక్కలకు అంట్లు కట్టి పెంచారు. ఆమె ఇంట్లో సుమారు 35 పైగా ఎడారి గులాబీ మొక్కలు ఉన్నాయి. పింక్, వైట్, పర్పుల్, మెరూన్... ఇలా విభిన్న వర్ణాల్లో గుబురుగా పూచిన పూలు కనువిందు చేస్తున్నాయి.
ఎడారి గులాబీలను ఎప్పుడైనా చూశారా..? - కనువిందు చేస్తున్న ఎడారి గులాబీలు
ప్రత్యేక వర్ణంలో కనిపిస్తున్న ఈ గులాబీలు మనసు దోచేస్తున్నాయి కదూ. అవి మామూలు గులాబీలు కాదు... ఎడారి గులాబీలు. ఎడినియం మెుక్కకు పూసిన పువ్వులు. వీటి అందాన్ని ఆస్వాదించాలంటే విజయవాడ వెళ్లాల్సిందే.
కనువిందు చేస్తున్న ఎడారి గులాబీలు
వీటికి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు. నిర్వహణా సులువే. వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. నీళ్లు లేని చోట్లా ఇవి పెరుగుతాయి. డాబాపై కుండీల్లో వీటిని పెంచుతున్నారు. ఏడాది నుంచి పాతికేళ్ల వయసున్న మొక్కలు ఆమె వద్ద ఉన్నాయి. మొక్క వయసుని బట్టి వాటి ఖరీదు 2వేల రూపాయల నుంచి లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ పెరటితోట అవార్డునూ అందుకున్నారు జయశ్రీరాణి.