వేగంగా పరిగెత్తే కారును ఆవు అడ్డుకునే ప్రయత్నం చేసింది. సుమారు 200 మీటర్లు కారు వెంట పరిగెత్తి అందరి చూపును ఆకర్షించింది. తెలంగాణ వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వెనకాల ఉన్న రహదారిపై వేగంగా వెళ్తున్న కారును ఆవు అడ్డుకుంది.
కారుతో పోటీపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది? - వనపర్తిలో కారుతో పోటి పడి పరిగెత్తిన ఆవు
కారుతో ఆవు పోటీపడి పరిగెత్తడం ఎక్కడైనా చుశారా..! అవును ఓ వైపు కారు వేగంగా వెళ్తోంది.. దానిని అనుసరించి ఆవు కూడా పరిగెత్తింది. కారును డ్రైవర్ ఆపాడు.. ఆవు కూడా ఆగింది. మళ్లీ కారు స్టార్ట్ అయ్యింది. ఆవు మళ్లీ వెంబడించింది. ఈ సంఘటన తెలంగాణ వనపర్తిలో చోటు చేసుకుంది.
కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది?
ఆవును తప్పించుకుని ముందుకు సాగిన ఆ కారును వదలకుండా అలాగే పరిగెత్తుతూ అనుసరించింది. ఆవును తప్పించుకుందామని కారు డ్రైవర్ పలు ప్రయత్నాలు చేసినా ఆవు మాత్రం పట్టు వీడలేదు. 200 మీటర్ల దూరం వెళ్లాక చేసేది ఏమీ లేక కారును నిలిపివేశాడు. అయినా కారును వదలని ఆవు కారు ముందే నిల్చుని ఉండిపోయింది. ట్రాఫిక్ జాం అవుతున్న సంగతిని గమనించిన పోలీసులు ఆవును పక్కకు తోలారు.
ఇదీ చూడండి :గౌరవప్రదంగా ఆఖరు మజిలీ... వారి సంస్కారానికి సలాం!