లేగదూడ మరణంతో ఓ గోమాత మూగ రోదన.. మాతృ ప్రేమకు అద్ధంపట్టింది. లారీ ఢీకొని ఆవు దూడ చనిపోయింది. ఇది చూసి తల్లడిల్లిన తల్లి ఆవు రోదన.. స్థానికులను కలచివేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
కళ్లముందే బిడ్డ మరణంతో... తల్లడిల్లిన గోమాత!
తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్పే సంఘటన ఇది. రహదారిపై ఓ ఆవు తన బిడ్డతో కలిసి ఆహారం కోసం ప్రయాణం సాగిస్తుంది. అదే సమయంలో ప్రమాదవ శాత్తు అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో .. ఆవు దూడ చనిపోయింది. అది చూసిన తల్లి ఆవు మూగ రోదన.. మాతృప్రేమకు అద్ధం పట్టింది. గంటల తరబడి చనిపోయిన బిడ్డను నెమరుతూ.. అక్కడే ఉండిపోయింది ఆ గోమాత. బిడ్డ కోసం తల్లి ఆవు పడిన వేదన స్థానికులను కలచివేసింది. అనంతరం చనిపోయిన దూడను స్థానికులు తరలించినా... రాత్రి వరకు రహదారుల వెంట అరుస్తూ.. విషణ్న వదనంతో కనిపించింది ఆ గోమాత.
గోమాత
బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఆ గోమాత.. గంటల తరబడి అక్కడే కూర్చుని లేగదూడను నిమురుతూ ఉండిపోయింది. గోమాత బాధను చూడలేని స్థానికులు.. చనిపోయిన దూడను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత గోవు మరింత విషణ్న వదనంతో కనిపించింది. రాత్రి వరకూ రహదారుల వెంట అరుస్తూనే తిరిగింది. బిడ్డ కోసం తల్లి ఆవు పడిన వేదన స్థానికులను కలచివేసింది. బహూషా తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్పే ఘటన ఇంతకంటే మరొకటి ఉండదేమో!