కృష్ణా జిల్లా కంచికచర్ల రంగానగర్‌లో కరోనా పాజిటివ్ వచ్చిందని జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తి గొంతు కోసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాయం పెద్దది కావడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. నారాయణ కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గుమాస్తాగా 30 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు.