జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్మికుల బతుకులు నాశనం చేసే ఫైలుపై సంతకం చేశారని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. కృష్ణాజిల్లా గుడివాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించి బైఠాయించారు. ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల రూపాయల పరిహారంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల ఆందోళన.. మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడి - The construction workers besieged Kodali Nani home news
గుడివాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించారు.
![భవన నిర్మాణ కార్మికుల ఆందోళన.. మంత్రి కొడాలి నాని ఇంటి ముట్టడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5028533-708-5028533-1573471101633.jpg)
మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తున్న భవన నిర్మాణ కార్మికులు
మంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు