ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనితీరును విశ్లేషించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఈ నెల 31లోపు కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తరగతి బోధన, బోధనలో ఉపకరణాల వినియోగం, వర్చువల్, డిజిటల్ తరగతుల వినియోగం.. తదితర అంశాలను ఈ కమిటీలు పరిశీలించి నివేదిక అందించేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. తనిఖీల ఆధారంగా ఆయా పాఠశాలలకు.. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగోలేదు అనే నాలుగు రకాల గ్రేడింగ్‌లలో ఏదో ఒకటి ఇస్తారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గ్రేడ్‌లు - andhrapradesh govt schools grading
ప్రభుత్వ పాఠశాల పనితీరును విశ్లేషించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చర్యలు చేపట్టారు. ఆయా పాఠశాలలను తనిఖీలు చేసి గ్రేడింగ్ ఇచ్చేలా కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
The Commissioner of Education will set up committees to give grading to a government high school