సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన తండ్రి కృష్ణ నటించిన 364 చిత్రాల పేర్లు చెప్పి హాసిని అనే పాప అబ్బురపరిచింది. విజయవాడ అలంకార్ సెంటర్ నందు మహేశ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా హాసిని అనే చిన్నారి సూపర్ స్టార్ కృష్ణ చిత్రాల పేర్లను అనర్గళంగా చెప్పి ఆకట్టుకుంది. తనకు మహేశ్ బాబు అంటే చాలా అభిమానమని పాప తెలిపింది. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ చాలా మంచి పనులు చేస్తున్నారని తెలిపింది. అందుకే ఆయనకు పుట్టినరోజు బహుమతిగా సూపర్ స్టార్ కృష్ణ చిత్రాల పేర్లను కంఠస్తం చేసి చెప్పినట్లు వివరించింది.
మహేశ్‌బాబు పుట్టినరోజు..ఓ చిన్నారి అద్భుతమైన కానుక - విజయవాడలో మహేశ్ జన్మదిన వేడుకలువిజయవాడలో మహేశ్ జన్మదిన వేడుకల వార్తలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన తండ్రి కృష్ణ నటించిన 364 చిత్రాల పేర్లు చెప్పి హాసిని అనే పాప అబ్బురపరిచింది. తనకు మహేశ్ బాబు అంటే చాలా అభిమానమని పాప తెలిపింది.
![మహేశ్‌బాబు పుట్టినరోజు..ఓ చిన్నారి అద్భుతమైన కానుక baby hasini](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8344436-234-8344436-1596889329989.jpg)
బేబీ హాసిని