ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి వద్దకు ఇసుక సరఫరా చేసే విధానంలో మార్పులపై కసరత్తు

ఇప్పటి నుంచి వినియోగదారుడు నచ్చిన ఇసుకను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. నాసిరకం ఇసుకను ఇంటి నిర్మాణాలకు అందిస్తున్నారని .. అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వారి సమస్యలు తీర్చేందుకు అధికారులు ఈ కొత్త విధానం అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు.

the changes in the method of delivering sand to the home
ఇంటి వద్దకు ఇసుక

By

Published : Aug 19, 2020, 8:37 AM IST

ఒక్కోసారి నాణ్యత లేని ఇసుకను ఇంటి వద్దకు సరఫరా చేస్తుండటంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా.. వినియోగదారుడే నిల్వ కేంద్రానికి వచ్చి నచ్చిన ఇసుకను తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇంటి వద్దకు సరఫరా చేసే విధానాన్ని తొలగించనున్నారు. దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా మొదలుకానున్న ఇసుక కార్పొరేషన్‌లో ఈ నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నారు. నిర్మాణాలు, ప్లాస్టింగ్‌కు వేర్వేరు రకాల ఇసుక అవసరం అవుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక కావాలని నమోదు చేసుకుంటే.. నిల్వ కేంద్రంలో ఉండే ఏదో ఒక దానిని ఇంటికి పంపుతున్నారు. దీనిపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వినియోగదారుడు నిల్వ కేంద్రానికి వచ్చి నచ్చిన ఇసుకను ఎంపిక చేసుకునే వీలు కల్పించాలని భావిస్తున్నారు.

  • 72 గంటల్లో ఇంటి వద్దకు సరఫరా కావాల్సి ఉండగా.. చాలాచోట్ల జాప్యం చోటుచేసుకుంటోంది. నిల్వ కేంద్రం నుంచి తక్కువ దూరంలో ఉన్న ఇళ్ల వద్దకు ఇసుక సరఫరా చేసేందుకు లారీ యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇళ్ల వద్దకే ఇసుక సరఫరా విధానానికి స్వస్తిచెప్పి, వినియోగదారుడే తనకు నచ్చిన వాహనాన్ని సమకూర్చుకుని తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక కావాలని నమోదు చేసుకుంటే, సంబంధిత వ్యక్తికి నిజంగా అవసరం ఉందా? లేదా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించాక ఇసుక సరఫరాకు అనుమతించనున్నారు.

విశాఖలో నిండుకున్న నిల్వలు

  • విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అయిదు డిపోల్లో ఇసుక నిల్వలు అయిపోయాయి. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి వచ్చే ఇసుక దాదాపు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నగర పరిధిలోని మూడు డిపోల్లో మాత్రమే 1.5 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి.
  • రాజమహేంద్రవరం నుంచి విశాఖకు ఇసుక రవాణా టెండర్లు ఖరారు చేశారు. కిలోమీటర్‌కు టన్నుకు రూ.3.30 చొప్పున ఏపీఎండీసీ ధర ఖరారు చేయగా, టెండర్లలో ఇద్దరు గుత్తేదారులు రూ.3.69, మరో ఇద్దరు రూ.4.30, రూ.4.50 చొప్పున కోట్‌ చేశారు. వీరిలో రూ.3.69 చొప్పున కోట్‌చేసిన ఇద్దరిని ఖరారు చేయగా, ధర తగ్గించేలా మిగిలిన వారితోనూ చర్చలు జరుపుతున్నారు. ఒక్కో గుత్తేదారు ఆరు నెలల్లో లక్షన్నర టన్నులు చొప్పున రవాణా చేయాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details