కృష్ణాజిల్లా మోపిదేవి మండలం దివిసీమలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రైతులు అప్రమత్తమయ్యారు. ఎండబెట్టుకున్న వరి ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి భద్రపరుచుకుంటున్నారు. కోతలు ఆపేశారు. చేతికివచ్చిన పంట వర్షానికి దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దివిసీమలో మారిన వాతావరణం..రైతులు అప్రమత్తం - కృష్ణా జిల్లాలో పంట నష్టం
ఉన్నట్టుండి ఆకాశం అంతా మేఘాలు. ఎండ మాయమై వాతావరణం చల్లబడింది. నల్లని మబ్బులు వేగంగా వ్యాపించాయి. రైతుల్లో హడావిడి మొదలైంది. ఆరబెట్టిన పంటను బస్తాల్లోకి నింపుతున్నారు. కోతలు ఆపేశారు. వర్షం తమ కష్టాన్ని ఎక్కడ నీటిపాలు చేస్తుందోనని ఆవేదన చెందుతున్నారు.
రైతులు అప్రమత్తం