కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన సాల్మన్‌రాజు.. శోభనపురానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోగా కారు బోల్తా పడింది. సాల్మన్‌రాజుకు తీవ్ర గాయాలు కాగా.. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ట్రాక్టర్‌ను తప్పించబోయి కారు బోల్తా... ఒకరు మృతి - కృష్ణా జిల్లా నేర వార్తలు
కృష్ణా జిల్లా శోభనపురంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాల్మన్‌రాజు