ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాల్వలోకి దూసుకెళ్లిన కారు...వైద్యుడు మృతి - కాల్వలోకి దూసుకెళ్లిన కారు

అదుపుతప్పి పంట కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లా బద్రిరాజుపాలెం వద్ద జరిగింది. ఈ ఘటనలో ఓ వైద్యుడు మృతి చెందాడు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు
కాల్వలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Feb 1, 2020, 8:42 PM IST

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం సమీపంలో కృష్ణానది కరకట్టపై కారు ప్రమాదం జరిగింది. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్న కోసూరి శ్రీనివాసరావు తన భార్య, కుమారుడితో కలిసి అవనిగడ్డకు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందగా... మృతుడి కుటుంబ సభ్యులను స్థానికులు కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details