గుడివాడలో యువకుడి దారుణ హత్య - The brutal murder of a young man in gudwada, krishna district
ఓ యువకుడిని కత్తులో దాడి చేసి హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గుడివాడలో యువకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లా గుడివాడ ధనియాలపేటలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్గవ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. మృతుడి మెడ, పొట్టలో కత్తిగాట్లు ఉన్నాయి. భార్గవ్ గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్యానందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
TAGGED:
గుడివాడలో యువకుడి దారుణ హత్య