A British-era bridge to ruin: కృష్ణా జిల్లా కంకిపాడు-గుడివాడ మధ్య ఉండే రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సమీప గ్రామాల ప్రజలు వివిధ పనుల కోసం గుడివాడ, గన్నవరం, విజయవాడ సహా పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. పునాదిపాడు-పెదపారిపూడి రహదారిలో.. పది గ్రామాలను కలుపుతూ కుందేరు గ్రామం బయట... కాలువపై బ్రిటీష్ కాలం నాటి వంతెన ఉంది. దశాబ్దం క్రితం..ఈ ఇనుప వంతెన కూలిపోయింది. కూలిన బ్రిడ్జి పిల్లర్ల మీద ఇనుప రాడ్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఈ మార్గం మీదుగా భారీ వాహనాలు వెళ్లడంతో... మూడేళ్లలోనే బ్రిడ్జి దెబ్బతింది. అధిక బరువుతో కొన్నిచోట్ల ఇనుప రేకులు విరిగిపోగా.. మరికొన్ని తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం ఈ వంతన ప్రమాదకరంగా మారింది.
వంతెపై ఏర్పాటు చేసిన రేకులు పోయినప్పుడు కేవలం వెల్డింగ్ మరమ్మతు చేస్తున్నారని... కొద్ది రోజులకే అవి దెబ్బతింటున్నాయి. బ్రిడ్జిపై ఏర్పడ్డ ఖాళీల్లో వాహనాల టైర్లు ఇరుక్కుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. రేకులు తప్పుపట్టి ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. నిత్యం భయాందోళన మధ్య ప్రయాణం చేస్తున్నాం -ప్రయాణికులు