అప్పటివరకు ఎంతో హూషారుగా అల్లరి చేస్తూ కనిపించిన బాలుడు.. కొన్ని క్షణాల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరాడు. కళ్ల ఎదుటే కన్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది. హృదయాలను కలిచివేసే ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
BOY DIED: బస్సు రివర్స్ చేస్తుండగా ప్రమాదం..రెండేళ్ల బాలుడు మృతి - boy died news in krishna district
అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన చిన్నారి అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడు ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం వీరవల్లిలో విషాదం జరిగింది. వీరవల్లి సమీపంలో ఉన్న వేడుక హోటల్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రివర్స్ చేస్తుండగా.. ఆ వాహనం కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న కూలీల బస్సు మార్గమధ్యలో వీరవల్లి వద్ద భోజనం కోసం వేడుక హోటల్ దగ్గర బస్సును డ్రైవర్ ఆపాడు. బస్సు ఆపిన అనంతరం కాలకృత్యాల కోసం బాలుడిని తల్లి కిందకు దించింది. అదే సమయంలో పార్కింగ్ చేయడానికి బస్సు రివర్స్ చేస్తుండగా బాలుడు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి