ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరిగి విశాఖకు పయనమైన బీఈఎంఎల్ - Vijayawada BEML latest news

రాష్ట్ర రాజధాని నగరం. మెట్రో కారిడార్‌ వస్తోంది. మెట్రోకోచ్‌ల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టును దక్కించుకోవచ్చు. రాజధాని నిర్మాణానికి అవసరమైన యంత్రాలను అందించవచ్చు’.. అనే ఆలోచనతో వచ్చిన ఆ సంస్థ.. పరిస్థితులు తల్లకిందులు కావడంతో తన శాఖను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న శాఖ కార్యాలయంలో విలీనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంస్థ తీరు ఇది.

BEML Vijayawada branch
తిరిగి విశాఖకు పయనమైన బీఈఎంఎల్

By

Published : Dec 8, 2020, 11:49 AM IST

దేశ వ్యాప్తంగా 4వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌). రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో దీని శాఖ కార్యాలయాన్ని 2015లో ఏర్పాటు చేశారు. నాడు విజయవాడకు మెట్రో కారిడార్ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ప్రణాళికలు రూపొందించారు. డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీంతో మెట్రోకు అవసరమైన కోచ్‌లు సరఫరా చేసేందుకు బీఈఎంఎల్‌ ముందుకు వచ్చింది. బుల్‌డోజర్లు, గ్లాడర్‌లు లాంటి యంత్రాలను ఈ సంస్థ రూపొందిస్తుంది.

రాజధానిలో మెట్రోతో పాటు ఇతర కార్యక్రమాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని యంత్రాలను సరఫరా చేశారు. గత రెండేళ్లుగా ఒక్క యంత్రాన్ని అమ్మలేదు. మరోవైపు మెట్రో ప్రాజెక్టు విజయవాడకు రాదని తేలిపోయింది. కోచ్‌లు అందించే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో మెట్రో కారిడార్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నా.. అక్కడ కూడా వస్తుందన్న విశ్వాసం లేదని బీఈఎంఎల్‌ భావిస్తోంది. దీంతో ఈ కార్యాలయాన్ని మూసివేస్తోంది. ఇంతకు ముందు విశాఖ స్టీలుకు చెందిన బ్రాంచ్‌ కార్యాలయాన్ని విజయవాడ నుంచి గన్నవరానికి మార్పు చేసిన విషయం తెలిసిందే. మెట్రో కార్యాలయాన్ని మార్పు చేశారు. ప్రస్తుతం బీఈఎంఎల్‌ శాఖను ఎత్తేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details