ఆడుకుంటూ జామకాయ ముక్కను మింగడంతో అది గొంతులో అడ్డుపడి ఊపిరాడక ఓ పసికందు చనిపోయిన ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు శివారు గ్రామం లంకతోటలో జరిగింది.
CHILD DIED: గొంతులో జామ కాయ ముక్క అడ్డుపడి పసికందు మృతి - latest news in krishna district
కవల పిల్లలు పుట్టారని ఆనందించిన తల్లికి.. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆడుకుంటూ కవలల్లోని ఓ బిడ్డ జామ పండు ముక్క మింగేసింది. అది గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక మృతి చెందింది. నవమాసాలు మోసి.. తొమ్మిది నెలలు అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ ఆయువు తీరటంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీర్ల వెంకటేశ్వరరావు కుమార్తె జొన్నలగడ్డ స్వామి, అనిల్‌బాబు దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు. లంకతోటలోని అమ్మమ్మ ఇంట్లో పిల్లలు ఉండగా.. వారిలో పెద్దపాప వీక్షిత(9 నెలలు) గురువారం ఆడుకుంటూ నేలపై ఉన్న జామకాయ ముక్కను నోట్లో పెట్టుకుని మింగే ప్రయత్నం చేసింది. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడం వల్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చిన్నారి గొంతులోని జామ ముక్కను కక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తొమ్మిది నెలలు అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఆయువు తీరటంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
ఇదీ చదవండీ..CBI on jagan: ఆ కేసుల్లో వాదనలకు సిద్ధం కండి