అంగన్వాడీ కేంద్రాలకు ఆహారధాన్యాల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు... కృష్ణా జిల్లాలో గట్టిగా వినిపిస్తున్నాయి. అంతంతమాత్రం అందే ఆహార ధాన్యాలతో... చిన్నారుల ఆకలి తీర్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో గత రెండు నెలల నుంచి చిన్నారులకు, బాలింతలకు ఇవ్వాల్సిన శనగల పంపిణీ సక్రమంగా జరగడంలేదు. ఫలితంగా చిన్నారులు ఆహార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీకి పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా సక్రమంగా పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు ఆహారధాన్యాల సరఫరా ఎప్పుడో..! - krishna district anganwadi centers latest news in telugu
రెండు నెలల నుంచి ఆహారధాన్యాల పంపిణీ సక్రమంగా జరగడం లేదంటూ... అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. చిన్నారులకు, బాలింతలకు పౌష్టికాహారం కొరత లేకుండా... శనగలు, పామాయిల్, పాలు సక్రమంగా పంపిణీ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా అందని ఆహారధాన్యాల పంపిణీ
అంగన్వాడీ కేంద్రాలకు ఆహారధాన్యాల సరఫరా ఎప్పుడో..!