గన్నవరం చేరుకున్న 143 మంది ప్రవాసాంధ్రులు - aircraft reached Gannavaram as part of the Vandebharat mission
వందేభారత్ మిషన్ కింద విదేశాల్లోని వారిని స్వస్థలాలకు తరిలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 143 మంది ప్రవాసాంధ్రులు లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం చేరుకున్నారు.
వందేభారత్ మిషన్లో భాగంగా 143 మంది ప్రవాసాంధ్రులు ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నారు. వీరందరిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఏ జిల్లాకు చెందిన వారిని ఆ జిల్లాలకు తరలించనున్నారు. వీరి కోసం ప్రభుత్వ, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల ఆసక్తిని బట్టి ప్రభుత్వ , నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.