ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు వైకాపా తెలిపింది. ఆర్సీఈపీ పేరుతో దేశంపై ఆర్థిక దాడికి ప్రయత్నాలు జరిగాయని... ఈ ముప్పు నుంచి దేశ రైతాంగాన్ని కాపాడారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఒప్పందంలో భాగమైతే... 16 దేశాల మధ్య ఎలాంటి సుంకం లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేసుకునే అవకాశం ఉండేదని.. ఈ కారణంగా దేశం, రాష్ట్రంలోని రైతులు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉండేదన్నారు.
'ప్రధాని మోదీకి వైకాపా అభినందనలు.. ఎందుకంటే..?' - రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి తాజా వార్తలు
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి... భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు వైకాపా తరఫున రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి.. ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ నిర్ణయంతో దేశ రైతాంగం సంక్షోభంలోకి వెళ్లకుండా కాపాడారని అన్నారు.
ఆర్సీఈపీ నుంచి రైతాంగాన్ని కాపాడినందుకు మోదీకి అభినందనలు తెలిపిన వైకాపా