ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొంగి పొర్లుతున్న జలాశయాలు.. ఉద్ధృతి తట్టుకోలేక కాలువకు గండ్లు..! - ap 2021 news

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పెట్టి పలు జలాశయ కాలువలకు గండ్లు పడుతున్నాయి. తాజాగా తమ్మిలేరు వంతెనకు, కళ్యాణపులోవ జలాశయం ప్రధాన కాలువకు గండి పడింది.

thammileru-and-kalyanapyulova-reservoirs-damaged-due-to-heavy-floods
పొంగి పొర్లుతున్న జలాశయాలు.. ఉద్ధృతి తట్టుకోలేక కాలువకు గండ్లు..!

By

Published : Sep 7, 2021, 11:20 AM IST

పొంగి పొర్లుతున్న జలాశయాలు.. ఉద్ధృతి తట్టుకోలేక కాలువకు గండ్లు..!

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వంతెనకు గండి పడింది. తమ్మిలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరిగిన ప్రతీసారి ఇక్కడ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. గండి కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా శివాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరద వలన గండి పడగా... శివాపురం గ్రామస్థులే గండి పూడ్చే పనులు చేపట్టారు.

తాజాగా మరోసారి గండి ప్రమాదం నెలకొంది. ఇక్కడ గండి ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. గతేడాది చేసిన మరమ్మతులకు ఇప్పటి వరకూ నిధులివ్వకపోవడంతో... నాయకులు కూడా పనులు చేయించేందుకు ముందుకు రావడం లేదు. గండి వలన విద్యార్థులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

అలాగే విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపు లోవ జలాశయం ప్రధాన కాలువకు గండి పడింది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం పెరగడంతో వరద కాలువ ఉద్ధృతంగా ప్రవహించి జమీందారీ కొత్తపట్నం సమీపంలో ప్రధాన కాలువకు గండి పడింది. ఈ కారణంగా ఆ ప్రాంతానికి చెందిన పలువురు రైతుల పొలాల్లో ఇసుక మేటలు పడ్డాయి. గండి పనులు పూడ్చే క్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి:RAINS : రాష్ట్రంలో పొంగిపొర్లిన వాగులు, వంకలు... నేడు, రేపు భారీవర్షాలు

ABOUT THE AUTHOR

...view details