ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పది పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్ - పదోతరగతి పరీక్షల వార్తలు

రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేశ్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పరీక్షల రద్దు ద్వారా లోకేశ్ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

Minister Adimulapu Suresh
మంత్రి సురేశ్

By

Published : May 27, 2021, 4:08 PM IST

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పది పరీక్షలు వాయిదా: మంత్రి సురేశ్

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పదోతరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ తెలిపారు. కరోనాతో మృతిచెంది ఉపాధ్యాయుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన తెలిపారు. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు వాస్తవాలు గ్రహించాలని మంత్రి సురేష్ సూచించారు. పదోతరగతి పరీక్షల రద్దు ద్వారా నారా లోకేశ్ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పరీక్షలు రాయనంత మాత్రాన కరోనా రాదని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.

ఇదీ చదవండి:జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details