ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్‌డౌన్ ముగిసిన 2 వారాలకు 'పది' పరీక్షలు! - ఏపీలో పదో తరగతి పరీక్షలు 2020

పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టత ఇచ్చారు. లాక్​డౌన్ ముగిశాక రెండు వారాలకు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

tenth exams in ap
tenth exams in ap

By

Published : Apr 28, 2020, 6:14 PM IST

మీడియాతో మంత్రి సురేశ్

లాక్‌డౌన్ ముగిసిన 2 వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షల షెడ్యూలును త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ తయారు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న మంత్రి సురేశ్... ఈ విషయాలను వెల్లడించారు.

భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రికి వివరించారు. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం అయినందున డిజిటల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్రమంత్రి సూచించినట్లు చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు చేసి విస్తరించినట్లు కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని 9, 10 తరగతి విద్యార్థులకు ఇస్తున్నట్లు గుర్తు చేశామన్నారు. ఈ పథకానికి కేంద్రం నుంచి మరింత సహకారం ఇవ్వాలని కోరామన్నారు.

ABOUT THE AUTHOR

...view details