ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఏడాదికి 'పది' పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలి: చంద్రబాబు - ఎస్​ఎస్​సీ పరీక్షలపై చంద్రబాబు వ్యాఖ్యలు

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా వేళ... విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని సూచించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

chandra babu
chandra babu

By

Published : Jun 15, 2020, 7:29 PM IST

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ఈ ఏడాదికి రద్దు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా కష్టాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ.. మరో తుగ్లక్ చర్య అని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతమవుతున్న వేళ.... విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని సూచించారు.

సీఎం జగన్ కరోనాను తేలిగ్గా తీసుకోవటం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ట్రాక్టర్ల ర్యాలీలు, పూలు చల్లించుకోవడాలు, ఉత్సవాల్లో మునిగి... కరోనా కట్టడిలో విఫలమయ్యారని విమర్శించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే రాష్ట్రానికి ఈ దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details