పదోతరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ తో సహా సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రచారం జరుగుతుందని.. అదంతా అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ మిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. ఇవాళ తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ మరో షెడ్యూల్ సామాజిక మాధ్యమాల్లో వచ్చిందన్నారు. పదో తరగతి పరీక్షలపై ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి వదంతులను ఎవరో కావాలని సృష్టిస్తున్నారన్న కమిషనర్.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటికే మానసిక సంఘర్షణలో ఉన్నారన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాల వల్ల వారు మరింత ఆందోళనకు గురవుతారని చెప్పారు.