Tension at Veeravalli Police Station: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలు.. వీరవల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత Tension at Veeravalli Police Station: కృష్ణాజిల్లాలోని వీరవల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వీరవల్లి పీఎస్ వద్ద వైసీపీ-టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఫిర్యాదు కోసం వెళ్లిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పీఎస్ వద్ద ఇరువర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నాయి. అదనపు పోలీసు బలగాలు వీరవల్లి చేరుకుంటున్నాయి.
TDP Leader has Strongly Condemned YCP Leaders Provocative Actions: అంతకుముందు.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కవ్వింపు చర్యలకు దిగిన వైసీపీ శ్రేణుల్ని తెలుగుదేశం శ్రేణులు తరిమికొట్టారు. నారా లోకేశ్( Nara lokesh) యువగళం పాదయాత్ర లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ నాయకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫొటోలతో బ్యానరు ఏర్పాటు అయ్యింది. లోకేశ్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి వైసీపీ శ్రేణులు రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. లోకేశ్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన యువగళం బ్యానర్లను వైసీపీ శ్రేణులు చించేస్తున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర వహించారు. అయినా తెలుగుదేశం శ్రేణుల సంయమనం పాటించగా, వైసీపీ శ్రేణులు యువగళం పైకి ఇటుక రాయి విసరడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది.
TDP Leaders Ready to Answer Police Notices: ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తే పోలీసులకేం సంబంధం..? : టీడీపీ
తిరగబడ టీడీపీ కార్యకర్తలు:తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తిరగబడటంతో వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి పరారయ్యారు. వైసీపీ బ్యానర్ కట్టిన ప్రదేశం వద్దే లోకేశ్ చాలా సేపు నిలబడి చట్టాన్ని పరిరక్షించే తీరు ఇదేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ కార్యక్రమంలో కి వైసీపీ శ్రేణులు చొరబడుతుంటే చోద్యం చూస్తున్నారా అంటూ పోలీసులను నిలదీశారు. రంగన్న గూడెం గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేశ్ కు ఘనస్వాగతం పలుకుతూ ఆయనను ముందుకు తీసుకెళ్లారు.
Construction Workers Met Lokesh in Gannavaram: నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.. మెరుగైన పాలసీతో గత వైభవం: లోకేశ్
టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వంశీ:యువగళంలో పాదయాత్రలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ- టీడీపీ వర్గాలు వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్దే బాహా బాహీకి దిగాయి. ఫిర్యాదు చేయడానికి ఇరు వర్గాలు కుర్చీలు ఇసురుకున్నారు. అదనపు పోలీసు బలగాలు వీరవల్లి చేరుకుంటున్నాయి. వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్దకు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన అనుచరులు వచ్చారు. యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం శ్రేణులు దాడికి పాల్పడ్డారని వీరవల్లి పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే వంశీ ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని వెంట తీసుకుని స్టేషన్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు కొడాలినాని, వంశీలు హింసను ప్రేరేపించేలా దాడికి ఉసిగొల్పారని రంగన్నగూడెం ఘర్షణ పై తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 193వ రోజు: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకర్గం అంపాపురం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ, గారపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవాళ 22.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)సాగనుంది. కోడూరుపాడు, వీరవల్లి, రంగన్నగూడెం మీదుగా పట్టిసీమ కాలువ వరకు పాదయాత్ర జరగనుంది. పట్టిసీమ కాల్వ పరిశీలన అనంతరం లోకేష్ సింగన్నగూడెం మల్లవల్లిలో పారిశ్రామిక వాడ సందర్శించనున్నారు. భోజన విరామం తర్వాత కొత్తమల్లివల్లి మీదుగా లోకేష్ పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. మీర్జాపురంలో స్థానికులతో లోకేష్ మాట్లాడనున్నారు. తర్వాత అక్కడి శివారు విడిది కేంద్రంలో లోకేష్ బసచేయనున్నారు.
Nara Lokesh Comments on CM Jagan: వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం: లోకేశ్