ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులు కొట్టడం వల్లే మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు' - krishna district crime news

రేపూడితండాలో వ్యక్తి ఆత్మహత్య
రేపూడితండాలో వ్యక్తి ఆత్మహత్య

By

Published : Mar 15, 2022, 3:48 PM IST

Updated : Mar 15, 2022, 4:53 PM IST

15:41 March 15

కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేపూడితండాలో వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా జిల్లా ఎ. కొండూరు మండలం రేపూడితండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండాకు చెందిన లకావతు బాలాజీ(69).. పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స నిమిత్తం విస్సన్నపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాటుసారా విక్రయిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు సోమవారం రాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్​కు తీసుకెళ్లి ఎస్సై టి. శ్రీనివాస్ విచక్షణా రహితంగా కొట్టాడని.. దీంతో మనస్థాపానికి గురై మా నాన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బాలాజీ కుమారులు ఆరోపిస్తున్నారు.

రేపూడితండాలో ఇంటి వద్దనే మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఎస్సై టి. శ్రీనివాస్​ని సస్పెండ్ చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. మృతుని కుటుంబ సభ్యులతో నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు మంతనాలు జరిపారు. రాజీ దిశగా పలు దఫాలుగా చర్చించారు.

గతంలోనూ ఇదే విధంగా ఎస్సై కొట్టడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై టి. శ్రీనివాస్​పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సైను కాపాడేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు సర్కిల్ కార్యాలయం వద్ద పోలీసులపై మృతుని కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని ప్రాణాలకు విలువ కడతారా? అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:మర్రిపాడులో రోడ్డు ప్రమాదం.. ఒకదాన్నొకటి ఢీకొన్న నాలుగు లారీలు!

Last Updated : Mar 15, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details