వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా నేత రమేశ్ చౌదరిని.. కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లకుండా వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. గాయపడిన తనకు చికిత్స చేయించాలని చౌదరి వేడుకుంటున్నారు. ఆసుపత్రి పోలీస్ ఔట్ పోస్ట్ లో ఉన్న ఆయన బయటికొస్తే.. వైకాపా శ్రేణులు దాడికి పాల్పడేలా ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో వైకాపా శ్రేణులను వారు అదుపులోకి తీసుకున్నారు.
గుడివాడ ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు! - గుడివాడ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
కృష్ణా జిల్లా గుడివాడ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా నేత రమేశ్ చౌదరిని ఆస్పత్రికి వెళ్లకుండా.. వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు.

తెదేపా నేత చికిత్సకు అడ్డుచెప్పిన వైకాపా శ్రేణులు