ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ ప్రమాణాలతో 'టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్' - tensile fabric shed at durga ghat

విజయవాడ దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం... దుర్గా ఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మిస్తున్నారు. దసరా ఉత్సవాలకు ఈ షెడ్​ను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్​ కు శంకుస్థాపన చేస్తున్న ఆలయ పండితులు

By

Published : Sep 12, 2019, 5:47 PM IST

విజయవాడ దుర్గా ఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో 'టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్'

విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం... దుర్గా ఘాట్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్ నిర్మిస్తున్నారు. రాష్ట్ర సహకార బ్యాంకు - ఆప్కాబ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగనుంది. 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ నిర్మాణానికి... ఆలయ ఈవో సురేబ్ బాబు, ఆప్కాబ్ జీఎం విజయ భాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల సమయానికి షెడ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details