ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2020, 5:51 PM IST

ETV Bharat / state

రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. ఇద్దరు అరెస్టు

కృష్ణా జిల్లా నందిగామలో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు... ఓ షాపులో నిల్వ ఉన్న నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ten lakh valuable gutkha seized at nandigama
రూ.10 లక్షల విలువైన గుట్కా పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామలో నిషేధిత గుట్కాను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామకు చెందిన శివ అనే వ్యక్తి దుకాణంలో దాడులు చేశారు. భారీ మొత్తంలో గుట్కా బస్తాలు గుర్తించారు. విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details